హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమాలు | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమాలు

Mar 25 2026 6:52 AM | Updated on Mar 25 2026 6:52 AM

ధర్మవరం అర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా ధర్మవరంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ మేరీ వరకుమారి, జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ, నాయకురాలు లతాదేవి, చెన్నేకొత్తపల్లి మండలాధ్యక్షుడు పెద్దకోట్ల సురేష్‌కుమార్‌, పట్టణ గౌరవాధ్యక్షుడు కేజీవీ నాగిరెడ్డి, పట్టణ కార్యదర్శి హెచ్‌.రామాంజనేయులు, రామగిరి మండల నాయకులు కృష్ణతేజ, అజయ్‌కుమార్‌ దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్‌సీని వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగ, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్‌ మ్యాప్‌ ప్రకటించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌కార్డులు, మెడికల్‌ బిల్స్‌ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కోవిడ్‌ సమయంలో మరణించిన 953 మంది పంచాయతీరాజ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా హామీలు నెరవేర్చకపోతే ఏప్రిల్‌ 1 రెండు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడుతామని, అప్పటికీ స్పందించకపోతే విజయవాడ కేంద్రంగా ఏప్రిల్‌ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ఏప్రిల్‌ 28న సెక్రటేరియట్‌ను ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్‌ సురేష్‌కు వినతిపత్రం అందించారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అమర్‌నారాయణరెడ్డి, పెన్షనర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు చలపతి, అల్లా బకాష్‌, నాగేంద్ర, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఆదిశేషు, సీఐటీయూ నాయకులు రమణ, ఆదినారాయణ, ఏపీ ఎన్జీఓ నాయకులు శ్రీనివాసులు, యూటీఎఫ్‌ నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, లతాదేవి, గోపాల్‌రెడ్డి, వెంకటకిషోర్‌, ఆదినారాయణ, నారాయణస్వామి, రాంప్రసాద్‌, బిల్లే రామాంజనేయులు, ఆదిశేషు, బాలగొండ్ల ఆంజనేయులు, గడ్డం రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement