గృహ నిర్మాణంలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణంలో వేగం పెంచాలి

Mar 25 2026 7:19 AM | Updated on Mar 25 2026 7:19 AM

ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణం, తాగునీరు, గ్రామీణ పరిశుభ్రత అంశాల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘సాసా’ కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. మండలాల వారీగా పంచాయతీలకు ర్యాంకులు ఇచ్చి పోటీతత్వాన్ని సృష్టించాలన్నారు. తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధర్మవరంలో 165, హిందూపురం అర్బన్‌లో 43, కదిరి అర్బన్‌లో 41 గృహాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో పాటు ముదిగుబ్బ, గోరంట్ల మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శానిటరీ కాంప్లెక్స్‌ల పురోగతి తక్కువగా ఉందని, పీఎం సూర్యఘర్‌ అమలు కూడా వేగవంతం చేయాలన్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తనిఖీ

కదిరి టౌన్‌: కదిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. పెండింగ్‌ ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కంచాలని సూచించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కదిరి 9వ వార్డు సయ్యద్‌ వీధిలో షాహిదా, నిసార్‌ అనే లబ్ధిదారుల ఇంటిపైన సూర్యఘర్‌ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెళ్లను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట కదిరి ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ రెడ్డి శేఖర్‌, విద్యుత్‌శాఖ డీఈ కృష్ణదేవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement