రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి

Mar 25 2026 7:19 AM | Updated on Mar 25 2026 7:19 AM

ప్రశాంతినిలయం: జిల్లాలో రెవెన్యూ పాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పని చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాంకేతిక సమస్యలు అధిగమించి రీసర్వే పూర్తి చేయాలన్నారు. 22ఏ చుక్కల భూముల సమస్యలు, సరిహద్దు వివాదాలు, రెవెన్యూ క్లినిక్‌లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎక్కడా గ్యాస్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారధి, డీఎస్‌ఓ వంశీక్రిష్ణారెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement