నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం

Mar 24 2026 6:52 AM | Updated on Mar 24 2026 6:52 AM

కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం ప్రధాన అర్చకుడు పార్థసారధి ఆచార్యులు పర్యవేక్షణలో శ్రీవారి స్నపన తిరుమంజనం వైభవంగా సాగింది. ఉత్సవానికి ఉభయదారులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్‌.విష్ణువర్దన్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది సుబ్బరాజుగుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. పసుపుతో శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడిని అలంకరించి తులసిమాల ధరింపజేసి స్నపనం గావించారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

గణితం పరీక్షకు

214 మంది గైర్హాజరు

పుట్టపర్తి: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం 107 కేంద్రాల్లో నిర్వహించిన గణితం పరీక్షకు 21,413 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,241 మంది హాజరయ్యారని, 172 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఇక ప్రైవేటు విద్యార్థుల్లో 408 మందికి గాను, 366 మంది విద్యార్థులు హాజరుకాగా, 42 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఏడుగురు జిల్లా స్థాయి పరిశీలకులు, నలుగురు విద్యాశాఖ అధికారులు, అసిస్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ నుంచి వచ్చిన ఆరుగురు, 81 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు కలిపి మొత్తం 81 మంది అధికారులు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈఓ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement