● రెండోరోజు 50 మందికి స్థాన చలనం
పుట్టపర్తి టౌన్: ఒకే సబ్ డివిజన్‌లో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ సోమవారం పూర్తయ్యింది. సీనియార్టీ ఽఆధారంగా పూర్తి పారదర్శకతతో బదిలీలు చేపట్టినట్టు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రెండో రోజు జిల్లావ్యాప్తంగా ఉన్న ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్‌కు ఎస్పీ సతీష్‌కుమార్ బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. 20 మంది ఏఎస్‌ఐలు, ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు, 27 మంది మహిళా కానిస్టేబుళ్లు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. ముందుగా ఒకే సబ్‌డివిజన్‌లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి సీనియార్టీ జాబితాను ప్రొజెక్టర్‌పై ప్రదర్శించి ఖాళీలు చూపారు. అనంతరం సీనియార్టీ ప్రకారం నిబంధనలు అనుసరించి ఒక సబ్ డివిజన్ నుంచి మరొక సబ్‌డివిజన్‌కు సిబ్బంది కోరుకున్న చోటకు బదిలీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ వేణుగోపాల్, స్పెషల్‌బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ఐలు ప్రదీప్ సింగ్, ప్రసాద్, వీరన్నతోపాటు డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.


