రాజకీయ కక్షతో బిల్లులు ఆపారు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షతో బిల్లులు ఆపారు

Mar 24 2026 6:51 AM | Updated on Mar 24 2026 6:51 AM

ప్రశాంతి నిలయం: ‘‘రాజకీయ కక్షతో మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో మా సొంత డబ్బులు వెచ్చించి పనులు చేశాం. ఇప్పుడు మంత్రి సవిత మాకు బిల్లులు మంజూరు చేయవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. మీరైనా బిల్లులు మంజూరు చేయించండి’’ అని సోమందేపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు కలెక్టర్‌, జేసీ ఎదుట వాపోయారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వచ్చిన సోమందేపల్లి మండల సర్పంచ్‌లు రామాంజనేయులు, లక్ష్మీ నరసింహప్ప, శ్రీనివాసరెడ్డి, నాగరత్నమ్మ, ప్రతాపరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు ఈమేరకు అర్జీ ఇచ్చారు. అనంతరం వారు జేసీకి తమ సమస్య విన్నవించారు. కేతగాని చెరువు పంచాయతీలో రూ.6.80 లక్షలు, చాలకూరులో రూ.7.38 లక్షలు, వెలిదడకలలో రూ.4 లక్షలు, చాలకుంటలో రూ.8.90 లక్షలు, తుంగోడులో రూ.2.37 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇవన్నీ ఆయా గ్రామ పంచాయతీల విద్యుత్‌ సరఫరా, మోటర్ల మరమ్మతులకు వినియోగించినవేనన్నారు. వీటికి పంచాయతీల తీర్మానం ఉన్నా... అందుబాటులో నిధులున్నా మంత్రి సవిత బిల్లులు మంజూరు చేయకూడదని ఆదేశించారని, దీంతో ఎంపీడీఓలు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తమపై దయచూపి బిల్లులు మంజూరు చేయించాలని కోరారు.

ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలి

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకీ శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు వివిధ సమస్యలపై 214 అర్జీలు అందగా.. వాటిని స్వీకరించిన కలెక్టర్‌ పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు.

మంత్రి సవిత తీరని అన్యాయం చేస్తున్నారు

‘పరిష్కార వేదిక’లో సర్పంచ్‌ల ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement