● ఎస్పీ సతీష్‌కుమార్
పుట్టపర్తి టౌన్: పారదర్శకత, నిబంధనలే ప్రామాణికంగా కానిస్టేబుళ్ల బదిలీలు చేపట్టినట్టు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఆదివారం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వ్యాప్తంగా ఉన్న 90 మంది కానిస్టేబుళ్లకు ఎస్పీ సతీష్‌కుమార్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లలో ఒకే పోలీసుస్టేషన్‌లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఖాళీల జాబితాను ప్రొజెక్టర్‌పై ప్రదర్శించారు. బదిలీల నిబంధనలు ఎస్పీ స్పష్టంగా వివరించారు. అనంతరం సీనియార్టీ ప్రకారం నిబంధనలు అనుసరించి ఒక సబ్ డివిజన్ నుంచి మరొక సబ్ డివిజన్‌కు సిబ్బంది కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరగడంతో సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఏఓ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ నాగరాజు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.


