మధుర స్వరం.. పరవశ భరితం | - | Sakshi
Sakshi News home page

మధుర స్వరం.. పరవశ భరితం

Mar 23 2026 7:06 AM | Updated on Mar 23 2026 7:06 AM

ప్రశాంతినిలయం: శ్రోతలను మైమరపించేలా భక్తి రస మాధుర్యంతో సత్యసాయిని కీర్తిస్తూ సాగిన సంగీత కచేరీ పరవశభరితంగా సాగింది. ఆదివారం సాయంత్రం సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన నందిగిరి క్యాంపస్‌ విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిపై కృతజ్ఞతతో కూడిన భక్తి భావనను చాటుతూ కచేరీ చేపట్టారు. సత్యసాయి ఆధ్యాత్మిక లీలలను, సేవా స్ఫూర్తిని, ప్రేమ తత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సాయి కుల్వంత్‌ సభా మందిరంలో ఆశీనులైన భక్తకోటి సంగీత స్వరాన్ని వింటూ మంత్రముగ్ధులయ్యారు. పిదప విద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

ప్రశాంతి మందిరం వేళల్లో మార్పులు..

ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో నిత్యం సాయంత్రంపూట జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ వేళల్లో మార్పులు చేసినట్లు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి. 5 గంటల నుంచి 5.45 వరకూ వేదం, 5.45 నుంచి 6.30 వరకూ భక్తి గీతాలాపన, అనంతరం సత్యసాయి మహాసమాధి దర్శనం ఉంటుందన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

ఆకట్టుకున్న సాయి విద్యార్థుల సంగీత కచేరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement