6న జేఎన్‌టీయూ(ఏ) స్నాతకోత్సవం | - | Sakshi
Sakshi News home page

6న జేఎన్‌టీయూ(ఏ) స్నాతకోత్సవం

Mar 24 2026 6:51 AM | Updated on Mar 24 2026 6:51 AM

అనంతపురం: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం) 15వ స్నాతకోత్సవం ఏప్రిల్‌ ఆరో తేదీన నిర్వహించనున్నారు. భారతదేశ క్షిపణి మహిళ (మిస్సైల్‌ ఉమెన్‌)గా ఖ్యాతి దక్కించుకున్న టెస్సీ థామస్‌ను గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేశారు. ఛాన్సలర్‌ /గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరై జేఎన్‌టీయూ(ఏ) గౌరవ డాక్టరేట్‌ను అందజేయనున్నారు. ఈ మేరకు స్నాతకోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి.

అగ్ని పుత్రి టెస్సీ థామస్‌

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో టెస్సీ థామస్‌ ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ పనిచేస్తున్నారు. ఈమెను అగ్నిపుత్రిగా పిలుస్తారు. అగ్ని–4 క్షిపణికి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించి, మిస్సైల్‌ ప్రాజెక్ట్‌ను నడిపించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఈమె కేరళలోని త్రిశూర్‌ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌, పుణెలో ఎంటెక్‌, మిస్సైల్‌ గైడెన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1988లో డీఆర్‌డీఓలో చేరి, అగ్ని సిరీస్‌ క్షిపణుల అభివృద్ధిలో, ముఖ్యంగా అగ్ని–2, 3, 4, 5 క్షిపణుల గైడెన్స్‌, నావిగేషన్‌ సిస్టమ్‌లో కీలక పాత్ర పోషించారు. టెస్సీ థామస్‌కు మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మార్గదర్శకులు.

గౌరవ డాక్టరేట్‌కు టెస్సీ థామస్‌ ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement