పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఏపీ సత్యసాయి యూత్ బృందం శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ సభామందిరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. నేటి యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సత్యసాయి బోధనలు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయనే సందేశంతో సాగిన నాటిక దేశవిదేశీ భక్తులను ఆకట్టుకుంది. యువ స్ఫూర్తి – సాయి అనుగ్రహ దీప్తి అనే పేరుతో ప్రదర్వించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. అంతకు ముందు ఉదయం సాయి ప్రేమాతరంగిణి పేరుతో నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాలకు చెందిన 504 మంది భక్తులకు సత్యసాయి పాదుకలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు బహూకరించారు.
ప్రశాంతి నిలయం:


