కనుల పండువగా సిరిమాను ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా సిరిమాను ఉత్సవం

Mar 21 2026 4:50 AM | Updated on Mar 21 2026 4:50 AM

యల్లనూరు: మండలంలోని కొడవండ్లపల్లిలో వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ శుక్రవారం పెద్దమ్మ సిరిమాను ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిమ్మంపల్లి తిమ్మమ్మ గుడి నుంచి పెద్దమ్మ గుడి వరకూ ఎద్దుల బండిపై సిరిమానును ఊరేగింపుగా తీసుకువచ్చారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, రమాదేవి దంపతులు, కుమారుడు కేతిరెడ్డి సాయి ప్రతాప్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ సిరిమాను ఉత్సవాన్ని పెద్దారెడ్డి ప్రారంభించారు. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున జంతు బలులతో మొక్కులు తీర్చుకున్నారు. కొడవండ్లపల్లి పెద్దమ్మ ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసింది. తిమ్మంపల్లి తిమ్మమ్మగుడి వద్ద, కొడవండ్లపల్లి పెద్దమ్మ గుడి వద్ద హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. చింతకాయమందలో పెద్దమ్మ, అంకాలమ్మ, యల్లనూరులో పెద్దమ్మ, చిలమకూరులో యల్లమ్మ ఆలయాల వద్దనూ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి.

70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో వేడుక

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement