ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం
మడకశిర: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టనున్నట్లు ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మడకశిర ఆర్టీసీ డిపో సమీపంలో ఎన్‌ఎంయూఏ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సబబు కాదన్నారు. వీటిని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం అమలులో లొసుగుల వల్ల కండక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే లొసుగులను సరిచేయాలన్నారు. డ్రైవర్ పోస్టులను ప్రభుత్వమే శాశ్వత ప్రాతిపదికను భర్తీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించే సర్క్యులర్‌ను అన్ని డిపోల్లో అమలు చేయాలని, పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీ రమణ, కడప జోనల్ అధ్యక్షుడు వినోద్‌బాబు, జోనల్ కార్యదర్శి చెన్నారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామ నాయక్, షబ్బీర్, సీనియర్ నాయకుడు అప్పిరెడ్డి, మడకశిర డిపో కార్యదర్శి కరియన్న, వివిధ డిపోల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు


