●శివాజీ మహరాజ్‌కీ జై
హిందూపురం: హిందూ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. త్వరలోనే ఆర్టీసీ బస్టాండు సమీపంలోనే ప్రతిష్టించనున్న శివాజీ భారీ విగ్రహంతో బెంగళూరు రోడ్డు నుంచి మేళాపురం సమీపం వరకూ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు శివాజీ మహరాజ్ విగ్రహాన్ని సూగురు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద తీసుకెళ్లి పూజలు చేశారు. అక్కడి నుంచి యువకులు, మహిళలు, యువతులు బైక్‌ర్యాలీతో డీజే సౌండ్స్‌తో కేరింతలు కొడుతూ ఊరేగింపు నిర్వహించారు. త్వరలోనే విగ్రహ ప్రతిష్టను పెద్దఎత్తున నిర్వహిమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో శివాజీ ట్రస్టు సభ్యులు చలపతి, రమేష్‌రెడ్డి, ప్రణేష్, షిండే, శంకరప్ప, జగదీష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
●శివాజీ మహరాజ్‌కీ జై


