విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● ఎస్పీ సతీష్‌కుమార్
ఎన్‌పీకుంట/తలుపుల/తనకల్లు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపరాదని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు.మంగళవారం ఎన్‌పీకుంట, తనకల్లు,తలుపుల పోలీసుస్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాలపై ఆరా తీశారు. పోలీసు సిబ్బందికి సూచనలిచ్చారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచాలన్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా అరికట్టాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సమస్యలతో స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ నాగేంద్ర, ఎస్‌ఐలు సుమతి, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బాధితుడికి న్యాయం చేయండి..
ఇంటి ముందు రస్తాను కె.అంజినప్ప అనే వ్యక్తి ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టాడని, దీనిపై ప్రశ్నిస్తే తమ కుటుంబ సభ్యులపై రాళ్లు, కట్టెలతో దాడి చేశారని ఎన్‌పీ కుంట మండలం దిన్నిమీదపల్లికి చెందిన విశ్వనాథ ఎస్పీ వద్ద వాపోయాడు. దాడిలో వికలాంగుడైన తన అన్న గంగరాజు భుజం ఎముక విరిగిందన్నాడు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తిరిగి తమపైనే కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన ఎస్పీ సతీష్ కుమార్ గ్రామంలో విచారించి బాధితుడికి న్యాయం చేయాలని ఎస్‌ఐని ఆదేశించారు.
ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలి
● జేసీ మౌర్య భరద్వాజ్
ప్రశాంతినిలయం: ఇసుక పాలసీని పారదర్శ కంగా అమలు చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో జేసీ అధ్యక్షతన డీఎల్‌ఎస్‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక తవ్వకం, రవాణ, సరఫరాలో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. ప్రతి మండలంలో పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమాలను అరికట్టాలన్నారు. నదీ ప్రవాహాల పక్కన ఉన్న గ్రామాల పరిధిలో వ్యక్తిగత వినియోగం కోసం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా రవాణాకు అనుమతి ఉంటుందని, అయితే యంత్రాల ద్వారా ఇసుక తవ్వకానికి అనుమతి లేదన్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించా లన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలకు అవసరమైన మేరకు ఇసుక అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయ్‌కుమార్, గనులు, భూగర్భ శాఖ అధికారి అమీర్ బాష, డీపీఓ సమత, చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వేదిక.. ప్రజలే కానరాక!
ఎన్‌పీకుంట: ప్రజలే లేకుండా ప్రజా వేదికను నిర్వహించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. మండల కేంద్రంలో మంగళవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికను ‘మమ’ అనిపించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఈటె రాము అధ్యక్షతన నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలో ఎక్కడా ప్రజలు కానీ, ఉపాధి కూలీలు కానీ కానరాకపోవడం గమనార్హం. కేవలం ఉపాధి సిబ్బంది, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు చేపట్టిన రూ.14,68,31,330 పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం ఇచ్చిన నివేదికలను చదివి వినిపించారు. మస్టర్లలో సంతకాలు లేకుండానే బిల్లులు చేయడం, బినామీల పేర్లమీద బిల్లులు పెట్టడం, పనులు చేసిన ప్రదేశం మార్పు, ఫారం పాండ్ గుంతలు పూడ్చివేయడం వంటి అవకతవకలను గుర్తించి రూ.88,558 రికవరీకి ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రొసీడింగ్ అధికారి వెంకటాచలపతి అంబుడ్స్‌మెన్ శివారెడ్డి, ఏవీఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు


