కురాష్ చాంపియన్‌గా ‘అనంత’
అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రస్థాయి 69వ అండర్–14, 17, 19 కురాష్ పోటీల్లో అనంతపురం జట్టు క్రీడాకారులు ఐదు విభాగాల్లో విజయం సాధించి, ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. ఆదివారం పోటీలు ముగిసాయి. వివిధ విభాగాల్లో ఫిలిప్, యూసఫ్, జశ్వంత్ గిరిబాబు, సుజితకుమార్, శశికాంత్‌రెడ్డి, జతిన్, వెంకట్, చరణ్‌తేజ్. వరుణ్‌కుమార్, తేజ, దేవదర్శన్‌రెడ్డి, యోగీశ్వర్ రెడ్డి, మణికంఠ, ఫయాజ్, ధృవరెడ్డి, దీపుసింగ్, లావణ్య, వరలక్ష్మి, గోపిక, చందన, లోకేశ్వరి, పూజిత, భవ్య, లేక్షణ్యరెడ్డి, నవీన్, మనోహర్, వివేకానంద, అశోక్, మౌలాలి, దినేష్‌కుమార్, పూజిత్‌రాజ్, చరణ్, ప్రణతి, రిక్షిత, మనీషా, నిర్మల, జ్యోతి, ఝాన్సీ, లక్ష్మి, సాయి లిఖిత, హృదయ బంగారు పతకాలు సాధించారు. విజేతలను అభినందిస్తూ బహుమతులను డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, మాంటిస్సోరీ కరస్పాండెంట్ భరత్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసులు ప్రదానం చేశారు.
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో
‘అనంత’కు మూడో స్థానం
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి 12వ సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో అనంతపురం జిల్లాకు మూడో స్థానం దక్కింది. విజేతగా గుంటూరు జట్టు నిలిచింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల క్రీడా మైదానంలో పోటీలు జరిగాయి. రెండో స్థానంలో విజయనగరం జట్టు నిలిచింది. విజేత జట్లను అభినందిస్తూ ట్రోఫీలను సత్తెనపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు ప్రదానం చేశారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ వంశీకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణ, స్కాలర్స్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కె.సత్యం, లయోలా కళాశాల అడ్మిషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సాఫ్ట్‌బాల్ అసోసియేసన్ గుంటూరు జిల్లా సామంత్‌రెడ్డి, ట్రెజరర్ జనార్ధన్ యాదవ్ ఆవుల, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కురాష్ చాంపియన్‌గా ‘అనంత’


