●వందే.. మాతరం
పుట్టపర్తి అర్బన్: వందేమాతర జాతీయ గీతం ఆవిష్కరించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సామూహిక గీతాలాపన చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లోనూ ఉదయం 10 గంటలకు డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరుల ఆధ్వర్యంలో ఉద్యోగులు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు. అనంతరం డీఆర్‌ఓ మాట్లాడుతూ... దేశమంతా ఒకే తాటిపై నిలబడేలా వందేమాతరం గీతం ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, జాతీయ సమైఖ్యతకు, దేశ సమగ్రతకు అంకితం కావాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలోనూ శుక్రవారం వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఎస్పీ సతీష్‌కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మహావీర్ సిబ్బందితో కలిసి వందేమాతరం పాడారు. స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్ భారతావనిని ఒక్కతాటిపై నిలిపిన గీతం వందేమాతరం అని ఎస్పీ అన్నారు. 1875లో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం నేటికీ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ సుజాత, సూపరింటెండెంట్ సరస్వతి, మల్లికార్జున, సీసీ చిరంజీవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు వలి, మహేష్, రవికుమార్ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో సామూహిక గీతాలాపన


