
పుట్టపర్తి టౌన్: అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ హిట్’ సభలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జే రత్నాకర్, ఆర్డీఓ సువర్ణ, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయంనుంచి 1.42 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. సభ ముగిసిన తర్వాత అనంతపురం నుంచి హెలీకాప్టర్‌లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో 5.30 గంటలకు తిరిగి హైదరాబాదుకు వెళ్లారు.