
తన సబ్జెక్టే ఇంటి పేరుగా..
బత్తలపల్లి: మండలంలోని గరిశలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న బేల్దారి అంజినప్ప గారి తిమ్మప్ప అంటే గతంలో ఆయన పనిచేసిన మడకశిరలో ఎవరూ గుర్తు పట్టరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆయన పనిచేస్తున్న సమయంలో తన సబ్జెక్ట్‌లో విద్యార్థులు ఎవరూ వెనుకబడకుండా చూపిన శ్రద్ధనే కారణం. అందుకే ఆయన బోధించే సబ్జెక్ట్‌నే ఆయన ఇంటి పేరుగా ఆ ప్రాంత వాసులు మార్చేశారు. దీంతో తిమ్మప్ప కాస్త ఇంగ్లిష్ తిమ్మప్పగా ఆయన ఖ్యాతి గాంచారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఫలితంగా పలుమార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు.