‘పురం’లో నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘పురం’లో నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు

Sep 4 2025 6:15 AM | Updated on Sep 4 2025 6:15 AM

‘పురం’లో నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు

‘పురం’లో నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు

డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంటుందని

ఎస్పీ రత్న వెల్లడి

హిందూపురం: చవితి రోజున మండపాల్లో కొలువై పూజలందుకున్న వినాయకుడి గంగఒడికి చేరే అపురూపఘట్టం ఆసన్నమైంది. వినాయక చవితి ఉత్సవాలకు జిల్లాలోనే పేరుగాంచిన హిందూపురంలో గురువారం గణేశుడి నిమజ్జనం అట్టహాసంగా సాగనుంది. ఇప్పటికే అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ రత్న హిందూపురంలో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా డ్రోన్‌, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్‌ ఎస్పీతో పాటు ఐదుగురు డీఎస్పీలు, 33 మంది సీఐలు, 63 మంది ఎస్‌ఐలు, 170 మంది ఎఎస్‌ఐలు,హెడ్‌ కానిస్టేబుళ్లు, 316 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 49 మంది మహిళా పోలీసులు, 210 మంది హోం గార్డులతో పాటు 4 ఏపీఎస్పీ ప్లటూన్లు, స్పెషల్‌ పార్టీ పోలీసులు... ఇలా మొత్తంగా 1,000 మంది నిమజ్జనం విధుల్లో ఉంటారని ఎస్పీ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా హిందూపురంలో ట్రాఫిక్‌ మళ్లించామని, ఈ విషయాన్ని వాహన చోదకులు, ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఉదయం 10 గంటల్లోపు

శోభయాత్రకు సిద్ధంకావాలి

గురువారం ఉదయం పదిగంటలల్లోపు అన్ని మండపాల నుంచి వినాయక విగ్రహాలు శోభాయాత్రకు బయలుదేరాలన్నారు. ఇందుకు గణేష్‌ మండపాల నిర్వహకులు సహకరించాలని ఎస్పీ రత్న కోరారు. నిమజ్జనం చేసే కోనేరు వద్దకు రాకుండా పిల్లలు, మహిళలను దూరంగా ఉంచాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా మతపెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, యువత, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు.

డిసెంబర్‌ 7న

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

పుట్టపర్తి అర్బన్‌: నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష డిసెంబర్‌ 7వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీనివాసులరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల్లోపు ఉండాలన్నారు. విద్యార్థులు ఈ నెల 4వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీలోపు www.bse.ap.gov.inల వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో ఆధార్‌ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు నమోదు చేయాలన్నారు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 ఎస్‌బీఐ లింక్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement