
ప్రశాంతి నిలయంలో ఓనం వైభవం
ప్రసంగిస్తున్న ఎంపీ ప్రేమచంద్రన్
సంగీత కచేరీ నిర్వహిస్తున్న బాలవికాస్ చిన్నారులు
ప్రశాంతి నిలయం: కేరళీయుల పవిత్రంగా ఆచరించే ఓనం వేడుకలు బుధవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత కేరళ సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లం ఎంపీ ఎన్‌కె.ప్రేమ చంద్రన్ ప్రసంగిస్తూ.. ఓనం పర్వదిన విశిష్టతను, సత్యసాయి నిస్వార్థ సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలన్నారు. అనంతరం శ్రీశైలానికి చెందిన శ్రీసత్యసాయి విద్యాపీఠం విద్యార్థులు ‘‘ది పాథ్ ఆఫ్ ట్రూ డివోషన్’’పేరుతో నృత్యరూపకం ప్రదర్శించారు. శబరి భక్తి ప్రపత్తులను వివరిస్తూ అద్భుతంగా ఆడిపాడారు.

ప్రశాంతి నిలయంలో ఓనం వైభవం

ప్రశాంతి నిలయంలో ఓనం వైభవం