
నష్టం మిగిల్చిన వేరుశనగ
● అ‘పూర్వ’ సమ్మేళనం
కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు
నల్లమాడ: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994–95లో పదో తరగతి చదువుకున్న వారు అదే పాటశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. మూడు దశాబ్దాల తర్వాత కలుసుకున్న వారి ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. నాటి గురువులు వెంకటరమణప్ప, దేవవరం, బాషా, సుబహాన్, రమాదేవి, ప్రస్తుత హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, వార్డెన్ రవిచంద్రరాజును ఘనంగా సత్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. పాఠశాల ఆవరణలోని జువ్వి చెట్టు చుట్టూ అరుగు నిర్మించేందుకు నల్లసింగయ్యగారిపల్లికి చెందిన పూర్వ విద్యార్థి ఎం.శ్రీనివాసులు రూ.20 వేలు అందజేశారు.
నల్లమాడ: అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, గిట్టుబాటు ధర లేకపోవడం.. దళారీల బెడదతో ఈ ఏడాది కూడా వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్ ఆరంభంలోనే కోటి ఆశలతో రైతులు వేరుశనగ సాగు చేపట్టారు. వర్షాధారంగా దాదాపు వెయ్యి ఎకరాల్లో వేరుశనగ సాగులోకి వచ్చింది. ముందస్తుగా సాగు చేపట్టిన రైతులు ఇప్పటికే పంట నూర్పిడి చేసి దిగుబడిని విక్రయించారు. మరికొందరు పంట నూర్పిడి పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పెట్టుబడులు కూడా చేతికి అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు రూ.10 వేలు నష్టం
ఒక ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగుకు విత్తనాలు, ఎరువులు, మందులు, సేద్యం, పంట నూర్పిడి తదిరాలన్నీ కలిపి రూ.35 వేలు పెట్టుబడి అయినట్లు నల్లమాడ మండల రైతులు శ్రీరాములు, చిదంబరరెడ్డి, ఓబిరెడ్డి, చంద్ర తెలిపారు. పంట నూర్పిడి అనంతరం ఎకరాకు 10 మూటల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో 44 కిలోలు వేరుశనగ బస్తా రూ.2,500 ధర పలుకుతోంది. ఈ లెక్కన ఒక ఎకరాకు రూ.25 వేలు మాత్రమే చేతికొస్తోంది. నాలుగు నెలల పాటు కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటే ఎకరాకు రూ.10 వేలు నష్టాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరుశగన విత్తనం వేశాక జూన్, జూలై మాసాల్లో తీవ్ర వర్షాభావానికి తోడు చీడపీడలు పంట దిగుబడిని దెబ్బతీసినట్లు అభిప్రాయపడుతున్నారు.
ఆదుకోని ప్రభుత్వం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా రైతులు ప్రధాన పంటగా వేరుశనగనే సాగు చేస్తున్నారు. దిగుబడి రాగానే ధర సగానికి పైగా పడిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. అరకొరగా పంట దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల బీమా కింద ప్రీమియం మొత్తాన్ని చెల్లించినా.. బీమా పరిహారం చెల్లింపులో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వాపోతున్నారు.
పెట్టుబడి కూడా దక్కని వైనం
ఆదుకోని ప్రభుత్వం..
నిరాశలో రైతులు

నష్టం మిగిల్చిన వేరుశనగ