జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Sep 1 2025 8:28 AM | Updated on Sep 1 2025 10:13 AM

జాతీయ

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

ధర్మవరం అర్బన్‌: జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ధర్మవరానికి చెందిన నిఖ్యశ్రీ అనే క్రీడాకారిణి ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అసోసియేట్‌ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోనున్న బాస్కెట్‌బాల్‌ కోర్టులో ఆదివారం సదరు క్రీడాకారిణిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల జరిగిన అంతర్‌ జిల్లాల పోటీల్లో ఉమ్మడి అనంతపురం బాస్కెట్‌బాల్‌ జట్టులో ప్రతిభ కనబరచిన ధర్మవరం క్రీడాకారిణి నిఖ్యశ్రీ రాష్ట్ర జట్టుకు ఎంపికై ందన్నారు. ఈమె సెప్టెంబర్‌ 2 నుంచి 9 వరకు పంజాబ్‌ రాష్ట్రం లూథియానా నగరంలో జరిగే 75వ జూనియర్‌ నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ బాస్కెట్‌బాల్‌ బాలికల జట్టు తరఫున పాల్గొంటుందన్నారు. జాతీయస్థాయిలో కూడా రాణించి ధర్మవరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ధర్మాంబ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్‌తుల్లా, కోచ్‌ సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో బుక్కపట్నం

హైస్కూల్‌కు అరుదైన గౌరం

పుట్టపర్తి: బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలకు అరుదైన గౌరవం లభించింది. 2024–2025లో రాష్ట, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటినందుకు గాను స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్‌ ఎక్సలెన్స్‌ ఆవార్డుకు ఎంపికై ంది. 23 మంది క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనపరిచి రికార్డు సృష్టించడం గర్వంగా ఉందని హెచ్‌ఎం జగదీశ్వర్‌ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు ఆయన తెలిపారు. క్రీడల్లో విద్యార్థులకు తర్ఫీదునిచ్చిన పీడీ నాగరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనంలో ‘పచ్చ’ రభస

గోరంట్ల: వెంకటరమణపల్లిలో అధికార టీడీపీ నాయకులు బరితెగించారు. తమ వీధిగుండా వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్లరాదంటూ ఓ వర్గం మహిళలు, ప్రజలపై కొడవళ్లతో దాడులకు తెగబడ్డారు.. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... వెంకటరమణపల్లిలో ఆదివారం సాయంత్రం, వైఎస్సార్‌సీపీ, ప్రజలు ఏర్పాటు చేసిన వినాయకున్ని నిమజ్జనం చేయడానికి గ్రామంలో ఉరేగింపుగా తీసుకెళ్లే సందర్భంలో.. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన నాగు అనే వ్యక్తి మరికొంత మంది వ్యక్తులు తమ వీధిగుండా వినాయకుడిని ఉరేగింపుగా తీసుకెళ్లరాదంటూ కొడవలితో అడ్డుకోబోయాడు. దీన్ని ప్రతిఘటించిన వినాయక సేవా సమితి సభ్యులపై దాడికి యాత్నించారు. దీంతో వినాయక సేవా సమితి సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బోయ శేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోకుండా.. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు చౌడిరెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. దీంతో అగ్రహించిన గ్రామస్తులు.. పోలీసుల తీరును నిరసిస్తు గ్రామంలో ధర్నాకు ఉపక్రమించారు. దీంతో పోలీసులు , ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకొన్నారు.

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక1
1/1

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement