
కష్టమంతా వృధా
మూడెకరాలు భూమిని కౌలుకు తీసుకుని జూన్‌లో వేరుశనగ పంట వేశా. పెట్టుబడి కింద రూ.లక్ష ఖర్చు వచ్చింది. దిగుబడి 35 మూటలు రావడంతో పెట్టుబడి మొత్తం కూడా చేతికి దక్కలేదు. మూడు నెలలకుపైగా మా కష్టమంతా వృధా అయింది.
– మాదారపు శ్రీరాములు, కౌలురైతు, మూలప్పగారిపల్లి, నల్లమాడ మండలం
గిట్టుబాటు ధర కల్పించాలి
వేరుశనగ రైతు ప్రతిసారీ నష్టపోతూనే ఉన్నాడు. ప్రభుత్వం వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాతో రైతులను ఆదుకుంది. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అనేది లేకుండా పోయింది. బీమా ప్రీమియంను రైతులే చెల్లించారు. అయినా పరిహారం అందజేతలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇలాగైతేనే రైతు మనుగడ కష్టం.
– చిట్టిబాల ఆదినారాయణరెడ్డి,
రైతు, రాగానిపల్లి, నల్లమాడ మండలం

కష్టమంతా వృధా