
ఔను ఇది సచివాలయమే...
రామగిరి: మండలంలోని పెద్ద కొండాపురం గ్రామంలో ఉన్న సచివాలయానికి రెండు రోజుల క్రితం స్థానిక టీడీపీ నేతలు పసుపు రంగు వేసి, కార్యాలయం ఎదుట జెండా స్తంభానికి పార్టీ జెండాను ఎగురవేశారు. దీంతో వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారు ఆశ్చర్యపోతూ ప్రభుత్వ కార్యాలయాన్ని మరో చోటుకు మార్చి ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు కాబోలని వెనుదిరుగుతున్నారు. రంగు వేసిన కొత్తలో అధికారులు సైతం ఇలాగే పొరబడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయానికి వేసిన రంగును మార్చాలని పలువురు కోరుతున్నారు.