
డ్రైప్రూట్స్ అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని రెండో రోజు డ్రైప్రూట్స్‌తో అలంకరించారు. సోమవారం వేకువజామునే ఆలయంలో మూలవిరాట్‌కు విశేష అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మంటపంలో కొలువుదీర్చి తమలపాకులతో లక్షార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
సజావుగా సప్లమెంటరీ పరీక్షలు
పుట్టపర్తి: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలి రోజు తెలుగు పరీక్ష సజావుగా జరిగినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు 1,554 మంది పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా 1,135 మంది హాజరయ్యారన్నారు.
నకిలీ అక్రిడిటేషన్
వ్యవహారంలో వ్యక్తి అరెస్ట్
అనంతపురం: జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిటేషన్‌లు సృష్టించిన వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్‌టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ప్రజాబలం పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే చందులాల్‌నాయక్, మన్నల దేవరాజు ఇద్దరూ కలిసి నకిలీ అక్రిడిటేషన్లు సిద్ధం చేసుకుని వాటిపై జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అసలు అక్రిడిటేషన్ కార్డుగా చలామణి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్బడుతున్నట్లుగా తెలుసుకున్న డీఐపీఆర్‌ఓ గురుస్వామిశెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు. సోమవారం మన్నల దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న చందులాల్‌నాయక్ కోసం గాలిస్తున్నారు.

డ్రైప్రూట్స్ అలంకరణలో నెట్టికంటుడు