సింహ, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి వైభవం
ఉరవకొండ రూరల్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి వారు సింహ, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని సింహ, చంద్రప్రభ వాహనాలపై ఆసీనులను చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగించగా.. భక్తులు శ్రీవారిని దర్శించుకుని పరవశించారు. అంతకుముందు లక్ష్మీనృసింహుని జయంతి సందర్భంగా పుష్పాలతో మూలవిరాట్‌ను అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి, ఈఓ సాకే రమేష్‌బాబు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు.
నేడు పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు.


