బెడిసి కొట్టిన వ్యూహం.. మొదట ఎమ్మెల్యే బాలకృష్ణ వద్దకు.. | - | Sakshi
Sakshi News home page

బెడిసి కొట్టిన వ్యూహం.. మొదట ఎమ్మెల్యే బాలకృష్ణ వద్దకు..

Jan 31 2025 12:46 AM | Updated on Jan 31 2025 7:29 AM

-

అడ్డదారిలో చైర్మన్‌ పదవి

దక్కించుకునేందుకు టీడీపీ కుయుక్తులు

కౌన్సిలర్లు హైదరాబాద్‌కు తరలింపు

హిందూపురం: ప్రజల ఆదరణతో గెలవకపోయినా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారిలో మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఇందులో భాగంగానే మరోసారి క్యాంపు రాజకీయానికి తెర తీసింది.

గతంలో బెడిసి కొట్టిన వ్యూహం..
సార్వత్రిక ఎన్నికల పూర్తయి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుటి నుంచి హిందూపురం మున్సిపాల్టీలో రాజకీయలు వేడెక్కాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మున్సిపాల్టీ పీఠం కై వసానికి ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 13 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి తమవైపు లాక్కొని గత ఏడాది అక్టోబరు 4వ తేదీన క్యాంప్‌ రాజకీయం చేశారు. వారం రోజులు టూర్‌కు తీసుకెళ్లి విలాసాల్లో ముంచేత్తారు. అయితే అక్టోబరు 8వ తేదీన చైర్మన్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకూ వైస్‌ చైర్మన్‌నే ఆ బాధ్యతలు నిర్వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో టీడీపీ నాయకులు ఖంగుతిన్నారు. ఆ వెంటనే క్యాంప్‌కు తీసుకెళ్లిన కౌన్సిలర్ల కుటుంబ సభ్యులతో పాటు హిందూపురానికి తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

మొదట ఎమ్మెల్యే బాలకృష్ణ వద్దకు..
మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కోసం మరోసారి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఫిబ్రవరి 3న బలనిరూపన, చైర్మన్‌ స్థానం ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూపురంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృత్వంలో టీడీపీ నాయకులు తమవైపు ఉన్న కౌన్సిలర్లతో మరోసారి క్యాంప్‌కు బయలుదేరారు. ఇందులో వైఎస్సార్‌సీపీ నుంచి గోడదూకిన 13 మంది కౌన్సిలర్లతో పాటు టీడీపీ, బీజేపీ, ఎంఐఎంకు చెందిన 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్‌ ఎన్నిక రోజున మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకునేలా ప్రణాళికలతో ముందుగా హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసిందుకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement