
సర్వే సమయంలో పొలాల వద్దకు వచ్చిన సర్వే బృందానికి ప్రజలు, రైతులు సహకరించాలి. సమస్యలున్న భూములకు సంబంధించిన ఇరువర్గాలు ఒప్పుకుంటే అన్ని ఖర్చులతో ప్రభుత్వమే సర్వే చేస్తుంది. కోర్టు కేసులున్న రైతులు త్వరగా తెంచుకొని సర్వే అధికారులకు సహకరించాలి. ఇప్పటికే 103 గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. రీ సర్వే కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలూ తీసుకున్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాం.
– జీపీ రామకృష్ణన్,
జిల్లా సర్వే అండ్ భూ రికార్డుల అధికారి