పాముకాటుకు గురైన రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుకు గురైన రైతు మృతి

Aug 9 2023 7:08 AM | Updated on Aug 9 2023 7:30 AM

- - Sakshi

పాముకాటుకు గురైన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన

శ్రీ సత్యసాయి: పాముకాటుకు గురైన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని సుద్దకుంటపల్లి తండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సుద్దకుంటపల్లి తండాకు చెందిన నాగేశ్‌నాయక్‌(40) తన పొలంలో వేరుశనగ పంట సాగు చేస్తున్నాడు. భార్య సాలమ్మతో కలసి సోమవారం పంటకు నీరందించేందుకు వెళ్లాడు.

స్ప్రింక్లర్‌ పైపులు మార్చుతున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లగా, అక్కడి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు కుమారులు నితిన్‌నాయక్‌, నిరంజన్‌ నాయక్‌ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement