తప్పులను సరిదిద్దుకోకుండా.. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడమే టీడీపీ నైజంగా మారిందని పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు మోసానికి గురై అవస్థలు పడుతుంటే, సర్కార్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మాయమాటలు చెప్పడం.. గద్దెనెక్కాక మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అరకొరగా ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారాక సీబీఐతో విచారణను జరిపిస్తామని తెలిపారు.


