స్పోర్ట్స్ కోటాలో దండుకోవాలనే ఉద్దేశంతో.. నచ్చిన వారికి పోస్టులివ్వాలనే ఉద్దేశంతో దొంగ జీఓలను జారీ చేశారని పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, రాజ్యాంగంపై విశ్వాసముంటే లోకేశ్ సైతం రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీ అవకతవకలకు నారా లోకేశ్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గురవయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు స్పందించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్స్ అంటే అంత చులకన తగదని, లోకేశ్ తప్పుకొనేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
లోకేశ్ బాధ్యత వహించాలి


