‘నాకు ముగ్గురు పిల్లలు. భర్త చనిపోయాడు. గత ప్రభుత్వంలో అమ్మఒడి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక రెండుసార్లు తల్లికి వందనం పడలేదు’ అని అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లికి చెందిన షేక్ నస్రీన్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె మాట్లాడుతూ గతంలో మార్కాపురం జిల్లా సీఎస్‌పురంలో తన భర్తతో కలిసి నివసించేవారమని చెప్పారు. భర్త చనిపోయిన తర్వాత పిల్లలతో కలిసి తన తండ్రి వద్దకు వచ్చి పాతదేవరాయపల్లిలోని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చదివించుకుంటున్నానని తెలిపింది. సచివాలయం వద్దకు వెళ్తే మా హౌస్‌హోల్డ్‌డ్ మ్యాపింగ్‌లో హోంగార్డు అయిన మరిది పేరు ఉందని చెబుతున్నారన్నారు. ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ తిరిగిన సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించి తల్లికి వందనం వచ్చేలా చూడాలని కోరారు.


