● జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
● బహిరంగ మద్యసేవనంపై 28 కేసులు
నెల్లూరు(క్రైమ్): జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం అర్ధరాత్రి వరకు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు, జిల్లా ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 15 కేసులు నమోదు చేశారు. అలాగే మోటార్ వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్) కింద 389 కేసులు నమోదు చేసి రూ.1,39,700 జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 28 కేసులు పెట్టారు. అనంతరం పలు లాడ్జీలను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టుల వద్ద పహారా మరింత పెంచామని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించినా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు, డయల్ 100/112కు లేదా జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 93929 03143కు సమాచారం అందించాలని కోరారు.


