ఇసుక టిప్పర్ల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

ఇసుక టిప్పర్ల అడ్డగింత

Jul 27 2026 12:12 AM | Updated on Jul 27 2026 12:12 AM

సంగం: బీరాపేరు బ్రిడ్జి సమీపంలోని అనధికారికంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ వద్ద టిప్పర్ల రాకపోకలపై రైతుల ఆగ్రహం భగ్గుమంది. ఆదివారం బైక్‌లను రోడ్డుకు అడ్డంగా నిలిపి రీచ్‌కు వెళ్లే టిప్పర్లను అడ్డుకుని నిరసన చేపట్టారు. ఇసుక టిప్పర్ల రాకపోకలతో రేగుతున్న దుమ్ముతో తమ పంటలు తీవ్ర నష్టం కలుగుతున్నా.. అధికారులు, రీచ్‌ నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రతి రోజూ వందల టిప్పర్లు రాక పోకలు సాగిస్తుండడంతో పంటలు దుమ్ముతో నిండిపోతున్నాయని, దీంతో తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు. దుమ్ము కారణంగా గ్రామస్తులు శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారన్నారు. ఇసుక తరలింపుతో కోట్లా ది రూపాయల ఆదాయం వస్తున్నా, రైతుల సమస్యలపై మాత్రం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 84,488 మంది దర్శించుకున్నారు. 37,061 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement