● మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
ఉదయగిరి: డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలతో ఎంతో మంది ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబాలు రోదిస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకొని ఎంతో ఖర్చు చేసి కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే ప్రతిభ ఉన్న వారిని కాదని, అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ విభాగంలో అక్రమా లు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా.. బాధ్యులపై ఇంత వరకు ప్రభు త్వం చర్యలు తీసుకోకపోవడంతో విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ అనర్హుడన్నారు.


