జ్యుడీషియల్‌ విచారణకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

జ్యుడీషియల్‌ విచారణకు డిమాండ్‌

Jul 23 2026 12:13 AM | Updated on Jul 23 2026 12:13 AM

నెల్లూరురూరల్‌: మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకుడు ఏడుకొండలు కస్టడీలో మృతిచెందిన ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ ఘటన జరిగి రోజులు గడిచినా ఇప్పటివరకు బాధ్యులపై శాఖాపరమైన లేదా క్రిమినల్‌ చర్యలు తీసుకోలేదన్నారు. పోలీస్‌ కస్టడీలో దళితుడు మృతిచెందడం అత్యంత దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అనేకం జరుగుతున్నాయని ఇది దారుణమన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ దొంతాల రఘు, సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పాముల శ్రీనివాసులు, నెల్లూరు సిటీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రాహుల్‌, ఇంకా బద్దేపూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement