● చైర్మన్, రిటైర్డ్ జస్టిస్
శ్రీనివాస ఆంజనేయమూర్తి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సమస్యలు అధికారుల వద్ద పరిష్కారం కాకపోతే సీజీఆర్‌ఎఫ్‌ను ఆశ్రయించాలని చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ శ్రీనివాస ఆంజనేయమూర్తి కోరారు. బుధవారం ఆయన నెల్లూరుకు విచ్చేశారు. విద్యుత్ భవన్‌లోని గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నూతన సర్వీసులు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లలో లోపాలు, మార్పు, లోడ్ పెంపు, తగ్గింపు, కేటగిరీల మార్పు, బిల్లుల్లో లోపాలు లాంటి సమస్యలకు పరిష్కారం లభించకపోతే సీజీఆర్‌ఎఫ్‌ను సంప్రదించాలని కోరారు. అంతకుముందు ఫిర్యాదులను సెక్షన్ కార్యాలయం, ఏఈ, ఏడీఈ, ఈఈ స్థాయి అధికారుల వద్ద నమోదు చేయాలని సూచించారు. ప్రత్యక్షంగా, పోస్ట్‌కార్డు, వాట్సాప్, ఏపీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్‌లోని పోర్టల్ ద్వారా కూడా సమస్యలు చెప్పొచ్చన్నారు. 2023 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 1,291 ఫిర్యాదులు అందగా 1,234 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. వివరాలకు 0877 – 2284118, 94408 12154 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో సభ్యులు మధుకుమార్, శ్రీనివాసబాబు, జిల్లా ఎస్‌ఈ రాఘవేంద్రం, ఈఈలు శ్రీధర్, ప్రసాద్, డీఈఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


