జర్నలిస్టుల రక్షణకు జేపీఎఫ్‌ ఆవిర్భావం | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల రక్షణకు జేపీఎఫ్‌ ఆవిర్భావం

Jul 23 2026 12:13 AM | Updated on Jul 23 2026 12:13 AM

నెల్లూరు రూరల్‌: జిల్లాలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, వేధింపులను ఎదుర్కొనేందుకు గానూ జర్నలిస్ట్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నగరంలోని కేవీఆర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గల ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా స్టాఫ్‌ రిపోర్టర్లు హాజరై ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా డెక్కన్‌ క్రానికల్‌ కరస్పాండెంట్‌ రాజశేఖర్‌, కన్వీనర్‌గా ఛానల్‌ – 9 ఎండీ జయరాజు, కో కన్వీనర్లుగా విశాలాంధ్ర బ్యూరో దయాశంకర్‌, హెచ్‌ఎంటీవీ బ్యూరో ఇనన్‌చార్జి నరసింహులు, 99 టీవీ బ్యూరో ఇన్‌చార్జి మురళీకృష్ణ, వార్త జిల్లా ఇనన్‌చార్జి నరేంద్ర, ఎన్‌ – 3 ఛానల్‌ ఎండీ సునీల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా టీవీ 9కు చెందిన మురళి, ప్రజాశక్తి బాలకృష్ణ, సాక్షి మస్తానన్‌రెడ్డి, ఆంధ్రప్రభ వెంకటేశ్వర్లు, ఈటీవీ రాజారావు, ఆర్టీవీ గయాజ్‌, సీవీఆర్‌ న్యూస్‌ రమేష్‌, ఏబీఎన్‌ మహేష్‌, టీవీ 5 రాజేష్‌, మహాన్యూస్‌ దినకర్‌, ఆంధ్రజ్యోతి అమర్‌, వీ 6 ఖాజా, 10 టీవీ దేవ, ప్రైమ్‌ 9 నరేష్‌, జీటీవీ మునీంద్ర, బీఆర్కే మల్లికార్జున్‌, ఎన్టీవీ వెంకటనారాయణ, బిగ్‌ టీవీ సురేంద్ర, స్వతంత్ర టీవీ మల్లి, సాక్షి టీవీ లోకేశ్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సురేంద్ర, ఐ న్యూస్‌ సాగర్‌ నియమితులయ్యారు. నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన జర్నలిస్ట్‌ దినేష్‌కు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి.. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement