నెల్లూరు (టౌన్): సమగ్రశిక్షలో జరిగిన అవినీతిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వింజమూరు, దుత్తలూరు ప్రాంతాల్లోని పాఠశాలల్లో ప్రహరీలను ఉపాధి హామీ నిధులతో నిర్మించి నాడు – నేడు కింద డ్రా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విజిలెన్స్ విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఎంకై ్వరీ అనంతరం నివేదికను అందజేశారు. దీంతో సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, సూపరింటెండెంట్ అశోక్‌ను మాతృశాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులను ఆ శాఖ ఎస్పీడీ శ్రీనివాసులు జారీ చేశారు. వెంకటసుబ్బయ్యను హయ్యర్ ఎడ్యుకేషన్‌కు.. అశోక్‌ను విద్యాశాఖ ఆర్జేడీకి గురువారం రిపోర్టు చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. టీసీఎస్ ప్రతినిధిగా పనిచేస్తున్న నేతాజీని తొలగించారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 82,105 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 34,484 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


