మెనూ ప్రకారం కూరలు, కోడిగుడ్లు, చికెన్ పెట్టడం లేదు. ఇదేమిని అడిగితే వార్డె న్ బండ బూతులు తిడుతున్నారు. మూడేళ్లుగా భరిస్తున్నాం. వసతిగృహం నుంచి గుడ్లు, బియ్యం తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. చికెన్, పాలు ఇంటికి తీసుకెళుతూ మా కడుపులు కాల్చుతున్నారు.
– సంతోష్, విద్యార్థి
వార్డెన్ వేధింపులు
భరించలేకపోతున్నాం
వార్డెన్ వేధింపులు భరించలేకపోతున్నాం. మెనూ ప్రకారం భోజనం సరిగా పెట్టడం లేదు. అర్ధాకలితో సరిపెట్టుకుంటున్నాం. వార్డెన్ చిన్నదానికి కూడా బూతులు తిడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుమిలిపోతున్నాం. వార్డెన్ వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. మా ఊరు చాలా దూరం కావడంతో వెళ్లలేక ఉంటున్నాం. ఆయన వార్డెన్‌గా ఉంటే ఇక్కడ ఉండలేం. ఇక్కడి నుంచి వేరే చోటుకు మార్చండి.
– వెంకటసాయి, విద్యార్థి
●


