● వృద్ధుడి ఆత్మహత్య
వరికుంటపాడు: ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలం జడదేవి గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారి పక్కన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడదేవికి చెందిన ఏనుగంటి కొండయ్య (65)కి భార్య ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతను కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులతో బాధపడుతూ వైద్యం చేయించుకున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోగా స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే కొండయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు.


