నెలరోజులు నరకయాతన అనుభవించి.. | - | Sakshi
Sakshi News home page

నెలరోజులు నరకయాతన అనుభవించి..

Jul 19 2026 11:56 PM | Updated on Jul 19 2026 11:56 PM

వాకాడు: ఆ వృద్ధుడి ఆఖరి రోజులు దారుణంగా గడిచాయి. లెప్రసీతో బాధపడుతుండగా ఆదుకునేవారు లేక అల్లాడిపోయాడు. చివరికి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వివరాలిలా ఉన్నాయి. నాయుడుపేటకు చెందిన అల్లెయ్య అనే వృద్ధుడు యాచిస్తుంటాడు. కొంత కాలంగా లెప్రసీ వ్యాధితో బాధపడుతున్నాడు. వాకాడు పరిసర ప్రాంతాల్లో యాచన చేసేవాడు. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నెలరోజులుగా కదల్లేని స్థితిలో తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని చెట్టు కింద అన్నపానీయాలు లేకుండా నరకయాతన అనుభవించాడు. పూర్తిగా స్పృహ కోల్పోయిన వృద్ధుడు శనివారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలులకు చతి తీవ్రత తట్టుకోలేక చనిపోయాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకూ మృతదేహం అక్కడే ఉంది. ఎవరూ పట్టించుకోలేదు. ఓ వ్యక్తి తన సొంత ఖర్చుతో అంబులెన్స్‌లో మృతదేహాన్ని నాయుడుపేటకు తరలించి బంధువులకు అప్పగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement