గడ్డివామి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గడ్డివామి దగ్ధం

Jul 19 2026 11:56 PM | Updated on Jul 19 2026 11:56 PM

రూ.లక్ష మేర ఆస్తినష్టం

ఆత్మకూరురూరల్‌: ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీ పాతజంగాలపల్లి గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని రైతు కటారి శ్రీనివాసులుకు చెందిన సుమారు గడ్డివామి మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అక్కడివారు వెంటనే స్పందించి ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఆత్మకూరు అగ్నిమాపక శాఖాధికారి బాలాజీ గురుప్రసాద్‌, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రైతుకు సుమారు రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.55

సన్నవి : రూ.25

పండ్లు : రూ.10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement