ఎంబుక్‌లలో పనులు.. జేబుల్లోకి నిధులు | - | Sakshi
Sakshi News home page

ఎంబుక్‌లలో పనులు.. జేబుల్లోకి నిధులు

Jul 19 2026 11:56 PM | Updated on Jul 19 2026 11:56 PM

● ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీలను గత ప్రభుత్వ హయాంలో జాతీయ హామీ పథకంలో నిర్మించారు. అయితే తాజాగా 2024 – 25 ఆర్థిక సంవత్సంలో మరోసారి చేసినట్లు చూపి రూ.13.4 లక్షలను విలాస్‌ పేరుతో కాజేశారు. కృష్ణంపల్లి పాఠశాలలోనూ మరోసారి బిల్లులు పెట్టి రూ.20.40 లక్షలను అదే పేరుతో స్వాహా చేశారు. ఈ మూడు పనులకు సంబంధించిన ఎంబుక్‌ల తయారీలో సమగ్ర శిక్ష సైట్‌ ఇంజినీర్లు బలరామ్‌, కృష్ణారెడ్డి సంతకాలున్నాయి. వీరి ప్రమేయంతోనే ఈ అవినీతి జరిగిందా.. లేక ఇతరుల హస్తం ఉందాననే విషయం తేలాల్సి ఉంది.

ఉదయగిరి: జిల్లాలో సమగ్రశిక్ష అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన పనుల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వర్కులు చేయకుండానే నిధులను భారీగా కాజేస్తున్నారు. ఆ శాఖకు సంబంధించి ఇప్పటికే అనేక అవినీతి బాగోతాలు బయటకొచ్చాయి. ప్రహరీల నిర్మాణాల్లో పనులు చేయకుండానే నిధులను దిగమింగిన ఉదంతాలు బట్టబయలైనా, ప్రమేయం ఉన్న అధికారులపై చర్యలు చేపట్టలేదు. ఈ వ్యవహారం వెనుక బడా వారుండటం.. వారికి అధికార పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండటంతో చర్యలకు జంకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తవ్వేకొద్దీ మరింతగా..

సమగ్ర శిక్షలో వెలుగు చూసిన అవినీతి రూ.మూడు కోట్లకుపైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే తవ్వేకొద్దీ ఇది మరింత పెరుగుతోంది. కొన్ని మండలాల్లో అసలు ప్రహరీలను నిర్మించకుండానే నిధులను మింగేసిన అంశం వెలుగులోకి వచ్చింది.

తాజాగా ఇలా..

మాయమైన ఎంబుక్‌లు

దుత్తలూరు మండలం నందిపాడుకు సంబంధించిన ఎంబుక్‌లు కనిపించడంలేదని సమాచారం. కొడవలూరు మండలం గండవరంలో ఇదే తరహాలో ఆరు పనులకు సంబంధించి రూ.60 నిధులను మింగేశారని తెలుస్తోంది. అవినీతి బాగోతంలో కార్యాలయ ముఖ్య అధికారితో పాటు పలువురు సైట్‌ ఇంజినీర్లు, ప్రైవేట్‌ ఐటీ కంపెనీ ఉద్యోగి పాత్ర ఉందనే ప్రచారం జరుగుతున్నా, వీరిపై నేటికీ చర్యలు చేపట్టకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తూ, ఇది మరుగునపడేలా ప్లాన్‌ ప్రకారం వ్యవహరిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.

వర్కులు చేయకుండానే స్వాహా

ప్రహరీల నిర్మాణం పేరుతో భారీగా అక్రమాలు

సమగ్రశిక్షలో బయటపడుతున్న బాగోతాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement