దుత్తలూరు మండలంలోని నందిపాడు కేజీబీవీ, దుత్తలూరు ఏపీ మోడల్ పాఠశాలల్లో ప్రహరీని నిర్మించినట్లు చూపి నిధుల స్వాహాకు అధికారులు పాల్పడ్డారనే అంశం శనివారం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఏపీ మోడల్ పాఠశాలలో 2018లోనే ప్రహరీని నిర్మించారు. అయితే 2022లో ప్రహరీని నిర్మించినట్లు 2025 నవంబర్‌లో వర్క్ ఐడీ నంబర్ – 9009016తో రూ.13,66,087 మేర.. నందిపాడు కేజీబీవీలో వర్క్ ఐడీ – 02090090009తో రూ.9,92,692 నిధులను స్వాహా చేశారు. సమగ్ర విచారణ జరిపితే గానీ పూర్తి వివరాలు బయటపడే అవకాశం లేదు.


