నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మణిహారంగా ఉన్న రామాయపట్నం పోర్టును చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఆందోళన బాట పట్టింది. పోర్టుకు వెన్నుపోటు పొడవడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకుంది. పోర్టుకు వెళ్లే దారుల్లో భారీ ఎత్తున పొలీసులను మోహరింపజేసి చలో పోర్టు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు పన్నింది. దాదాపు నాలుగు గంటల పాటు సహనంగా ఆందోళన చేసిన పార్టీ శ్రేణులపై ప్రభుత్వ కవ్వింపు చర్యలతో జాతీయ రహదారిపై బైఠాయించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యేలని చూడకుండా ఈడ్చిపడేశారు. కేసులు నమోదు చేశారు. మహిళలను సైతం లాగేశారు.
రామాయపట్నం పోర్టు సందర్శనను భగ్నం చేసేందుకు అడుగడుగునా కుట్రలు
వందల సంఖ్యలో
పోలీసుల మోహరింపు
పోర్టు దారిలో రేకులు, టిప్పర్లు అడ్డుపెట్టి అడ్డంకులు
పది రోజుల ముందే పోలీసులకు సమాచారమిచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అనుమతి లేదంటూ అడ్డుకున్న ఖాకీలు
ప్రభుత్వ తీరును నిరసిస్తూ
ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ
పోలీసులు, పార్టీ శ్రేణులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాటలు, ఉద్రిక్తంగా
మారిన పోర్టు ఏరియా
పోర్టు ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది
లేదంటూ నేతలు, స్థానికుల తీవ్ర ఆగ్రహం


