చేపలు పడుతూ చెరువులో పడి.. | - | Sakshi
Sakshi News home page

చేపలు పడుతూ చెరువులో పడి..

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

వ్యక్తి మృతి

ఆత్మకూరు: ఆత్మకూరు చెరువులో చిన్న తెప్పపై చేపలు పట్టేందుకు వెళ్తున్న వ్యక్తి నీటిలో పడిపోవడంతో మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చెరువులో చేపలు పట్టించే క్రమంలో సంబంధిత కాంట్రాక్టర్‌ రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను ఆత్మకూరుకు గురువారం తీసుకొచ్చాడు. వారిలోని మోజెస్‌ (31) అనే వ్యక్తి చిన్న తెప్పపై చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లగా ఆ సమయంలో అతనికి ఫిట్స్‌ రావడంతో నీటిలో పడిపోయాడు. పరిసరాల్లోని వారు గమనించి ఒడ్డుకు చేర్చగా అప్పటికే అతను మృతిచెందాడు. వెంటనే రాజమండ్రి నుంచి వచ్చిన మత్స్యకారులు అందరూ మృతదేహాన్ని తీసుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు. అక్కడి కాంట్రాక్టర్‌ను సంప్రదించినా తనకేమి తెలియదన్నట్లుగా చెప్పడం గమనార్హం. మృతుడికి రెండు రోజులుగా జ్వరం ఉందని, ఫిట్స్‌కు గురై నీళ్లల్లో పడిపోయాడని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement