నెల్లూరు(క్రైమ్): ఆటో చోరీపై వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పొర్లుకట్టకు చెందిన షాహీర్ ఆటో డ్రైవర్. ఆయన అప్పుడప్పుడు బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28వ తేదీ రాత్రి అతను కరెంటాఫీస్ సెంటర్ సమీపంలో తన ఆటోను పార్క్ చేశాడు. అక్కడే ఉన్న బస్సును క్లీన్ చేసి నిద్రపోయాడు. 29వ తేదీ తెల్లవారుజామున లేచిచూడగా ఆటో కనిపించలేదు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కండలేరులో
28.64 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 28.64 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 62 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


