డయల్‌ యువర్‌ ఎస్పీకి వినతులు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ ఎస్పీకి వినతులు

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ అజిత వేజెండ్ల డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 మంది సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా బదిలీలు, సస్పెన్షన్‌ తొలగింపు, ఇతర పరిపాలన అంశాలకు సంబంధించిన అభ్యర్థునలున్నాయి. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఏఓ సావిత్రమ్మ, సూపరింటెండెంట్లు సురే ష్‌, శిరీష, ఎస్‌బీ – 2 ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరెడ్డి, పీజీఆర్‌ఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పారా స్పోర్ట్స్‌కు 10 మంది

విద్యార్థుల ఎంపిక

నెల్లూరు(టౌన్‌): రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్‌ – 2026 పోటీలకు జిల్లాకు చెందిన 10 మంది దివ్యాంగ విద్యార్థులు ఎంపికై నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20 నుంచి 22 వరకు ఏలూరు జిల్లా అగిరిపల్లిలోని హీల్‌ స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థుల్లో రాజ్యపూడి సంజన, మేడబాలిమి నిత్యశ్రీ, షేక్‌ అప్సర్‌, రాగి మనోజ్‌ (వరికుంటపాడు), ముత్యం అశోక్‌ (రాపూరు), పురిమి వెంకట పవన్‌ సాయి, పురిమి వెంకట సుదీష్ణు (నెల్లూరు), గున్న ప్రతీక్‌ (సంగం మండలం అన్నారెడ్డిపాళెం), డి. మస్తానయ్య (సైదాపురం), ఎ.చరణ్‌తేజ (అల్తూరు) ఉన్నారని తెలిపారు. వీరికి రవాణా, వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఎంపికై న విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పోటీలకు హాజరయ్యేలా సంబంధిత ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం

సీతారామపురం: మండలంలోని అంకిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో గొల్లపల్లి ఆనందరావు (49) అనే వ్యక్తి తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఆనందరావు గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

రైలు కిందపడి

వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు(క్రైమ్‌): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌ కావలి వైపు వెళ్లే పట్టాలపై శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల్లోపు ఉంటుందని భావిస్తున్నారు. పసుపు రంగు ఫుల్‌హ్యాండ్స్‌ టీషర్టు, గ్రే కలర్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్‌.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని హరిచందన కోరారు.

ఆర్థిక సాయం అందజేత

ఉదయగిరి రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఉదయగిరికి చెందిన హోంగార్డు వాకమల్ల జనార్దన్‌రెడ్డిని శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మాజీ మండల కన్వీనర్‌ సీఎం ఓబుల్‌రెడ్డి, దాసరపల్లి మాజీ సర్పంచ్‌ గౌస్‌మొహిద్దీన్‌, మాజీ మండల ఉపాధ్యక్షుడు బాలిబోయిన శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ ఉప్పుటూరి హరి, నాయకులు ఎంఏ రియాజ్‌, గానుగపెంట ఓబుల్‌రెడ్డి, చేజర్ల సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement