● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు రూరల్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, డీఆర్వో విజయ్‌కుమార్ ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను అందజేశారు. హిమాన్షు శుక్లా మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో అందిన ప్రతి వినతిని పరిశీలించి, పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


